అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లికి చెందిన రైతు వెంకటరమణ రెండెకరాల పొలంలో వేరుశనగ సాగు చేశాడు. కురుస్తున్న వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. వేరుశనగ కుళ్లిపోయి కాయలు దక్కే అవకాశం లేదని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.
వేరుశనగ పంట పాడైందని రైతు ఆవేదన - anantapur dst taja updates
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేతికి అందిన పంట పూర్తిగా పాడైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలో ఓ రైతు అప్పు తెచ్చి సాగుచేసిన వేరుశనగ పంట కుళ్లిపోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు..ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరాడు.

farmers facing problems due to heavy rain fall in anantapur dst groundnut crop damaged