కరోనా నియంత్రణ కోసం అమలు చేసిన కర్ఫ్యూ... హిందూపురంలోని పట్టుగూళ్ల రైతుల పాలిట శాపంగా మారింది. పట్టుగూళ్లను కొనుగోలు చేసేందుకు రీలర్లు రాకపోవటంలో మార్కెట్లో వేలంపాట నడవక పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. ఉదయం హిందూపురం మార్కెట్‌కు వస్తున్న రీలర్లును పోలీసులు అడ్డుకోవటంతో వారు వెనుతిరిగారు. రీలర్లు తమ సమస్యను మార్కెట్ అధికారి వద్దకు తీసుకెళ్లగా.. అధికారి స్పందించకపోవటంతో రీలర్లు వేలంపాటలో పాల్గొనకుండా వెనుతిరిగారు. అధికారులు, రీలర్లుకు మధ్య సమన్వయం లేక తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో మార్కెట్‌కి రావాలనే ఆలోచనే కోల్పోతున్నామని అన్నదాతలు వాపోయారు. తక్షణమే అధికారుల స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
అధికారులు నిర్లక్ష్యం.. మార్కెట్లో రైతుల పడిగాపులు
రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హిందూపురం పట్టుగూళ్ల రైతులు వాపోయారు. అధికారులు, రీలర్లకు మధ్య సమన్వయం లేక తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారుల స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
రైతుల పడిగాపులు