విత్తనాల కోసం రహదారిపై రైతుల బైఠాయింపు - seeds
విత్తనాల కోసం రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అనంతపురంలో రహదారిపై రైతులు బైఠాయించారు. వేరుశెనగ విత్తనాల స్టాక్ లేని కారణంగా.. రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
farmers-dharna-for-seeds
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో వేరుశెనగ విత్తనాల పంపిణీలో జాప్యంపై రైతులు ఆగ్రహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉరవకొండ - గుంతకల్లు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఐదు గ్రామాల రైతులకు విత్తన పంపిణీ ఉంటుందని అధికారులు చెప్పగా.... రైతులు క్యూలో నిల్చున్నాక స్టాక్ రాలేదని చెప్పారు. తీవ్రంగా ఆగ్రహించిన రైతులు... ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పిన అనంతరం... ఆందోళన విరమించారు.