రాత్రంతా వేచి ఉన్నా.. ఖాళీ చేతుల్తో వెనుదిరిగారు! - farmers
వేరుశనగ విత్తనాల కోసం పడిగాపులు కాసిన రైతులకు నిరాశే మిగిలింది. అధికారులతో తమ గోడును ఎంత చెప్పినా లాభం లేకపోయింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన.. అన్నదాతలను ఆవేదనకు గురిచేసింది.
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో వేరుశనగ విత్తన పంపిణీ.. గందరగోళానికి దారితీసింది. అందుబాటులో ఉన్న K6 రకం విత్తనాల పంపిణీ పూర్తవగా.. K9 రకం విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటిని తీసుకునేందుకు రైతులు ఆసక్తి కనపరచలేదు. ఈ కారణంగా.. అధికారులు విత్తన పంపిణీ నిలిపేయడం.. రైతుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. రాత్రి నుంచి క్యూలైన్లలో ఉన్న తమను ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారని.. విత్తనాల పంపిణీ అర్థంతరంగా నిలిపేశారని అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వాగ్వాదానికి దిగారు. చివరికి.. రైతులు నిరాశగా వెనుదిరిగారు.