ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట రుణాల కొనసాగింపు కోసం రోడ్డెక్కిన రైతులు - రోడ్డెక్కిన రైతులు

పంట రుణాల రెన్యువల్‌ కోసం రైతులు రోడ్డెక్కారు. కెనరా బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. పాత రుణాలకు వడ్డీ కట్టించుకుని రుణాలు రెన్యువల్‌ చేయాలని డిమాండ్ చేశారు.

farmers-darna

By

Published : Jun 10, 2019, 3:18 PM IST

పంట రుణాల రెన్యువల్‌ కోసం రోడ్డెక్కిన రైతులు

పంట రుణాల రెన్యువల్ కోసం అనంతపురం జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. పెనుకొండ - పావగడ ప్రధాన రహదారిపై బైటాయించారు. రొద్దం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టించుకుని.. తాజాగా రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, బ్యాంకు మేనేజర్‌ రమేష్‌..... రైతులతో చర్చించారు. వడ్డీ కట్టించుకుంటామని అధికారులు హామీ ఇచ్చిన అనంతరం రైతులు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details