ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటను తరలించడంలేదు: పోలీసులకు రైతుల ఫిర్యాదు - ananthapuram latest news

డీజిల్ ధర సాకుగా చూపి పంటను ఇతర ప్రాంతాలకు తరలించకుండా లారీ యజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ... రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతుల పరిస్థితి ఇది. మార్కెటింగ్ శాఖ, రవాణా శాఖ అధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

farmers complaint on lorry owners
పోలీసులకు రైతుల ఫిర్యాదు

By

Published : Feb 25, 2021, 4:07 PM IST

పండించిన పంటను ఇతర ప్రాంతాలకు తరలించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని లారీ యజమానులపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్​కు రైతులు పంటను తీసుకొచ్చారు. ఇక్కడకు వచ్చిన టమాటా పంటను ఇతర ప్రాంతాలకు తరలించకుండా లారీ యజమానులు డీజిల్ ధరలు సాకుగా చూపి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.

డీజిల్ ధరలు పెరిగాయని వాహనదారులు.. తమ పంట ఎలా అమ్ముకోవాలని రైతులు.. తాము కొనుగోలు చేసిన టమాటాను ఎలా తరలించాలని వ్యాపారస్తులు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై మార్కెటింగ్ శాఖ, రవాణా శాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details