పంట రుణాలు రెన్యువల్‌కు సంబంధించిన టోకెన్లు తీసుకునేందుకు ఉదయం నుంచే బ్యాంకు ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్... పంట రుణాలు రెన్యువల్ చేపట్టింది. లాక్ డౌన్ కారణంగా రోజుకు 50 మంది రైతులకు మాత్రమే రుణాల రెన్యువల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 50 మంది రైతులకు బ్యాంకు సమయానికి ముందే టోకెన్లు ఇస్తున్నారు. వీటిని తీసుకొనేందుకు ఉదయం నుంచే రైతులు బ్యాంకు ఎదుట నిరీక్షిస్తున్నారు. బ్యాంకు అధికారులు 9 గంటల వరకు రానందున కొందరు వెనుతిరిగి వెళ్లారు.
పంట రుణాల రెన్యూవల్‌కు బ్యాంకుల వద్ద రైతుల అగచాట్లు - kadiri rural banks latest news
పంట రుణాల రెన్యూవల్‌కు కదిరిలోని గ్రామీణ బ్యాంకు సిబ్బంది రోజు 50 మంది రైతులకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్ల కోసం ఉదయం నుంచే రైతులు బ్యాంకు వద్ద బారులు తీరుతున్నారు.
![పంట రుణాల రెన్యూవల్‌కు బ్యాంకుల వద్ద రైతుల అగచాట్లు farmers coming to rural banks for their loan term renewal in kadiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7260378-587-7260378-1589878113833.jpg)
కదిరి గ్రామీణ బ్యాంకుల వద్ద నిలుచున్న రైతులు