ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers Attack: విద్యుత్ ఉద్యోగులపై రైతులు దాడి.. నలుగురిపై కేసు నమోదు - అనంతపురం జిల్లాలో విద్యుత్ సిబ్బందిపై దాడి

Farmers Attack on Electricity Employees: అనంతపురం జిల్లాలో విద్యుత్ బకాయిల వసూళ్లు వివాదాస్పదంగా మారాయి. శంకరబండ గ్రామంలో విద్యుత్ బిల్లుల కోసం వెళ్లిన సిబ్బందిపై పలువురు తిరగబడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపేశారని ఉద్యోగులను నిర్బంధించారు. తమపై దాడి చేశారని రైతులపై ఉద్యోగులు కేసు పెట్టారు.

farmer protest
farmer protest

By

Published : Feb 26, 2022, 1:45 PM IST

విద్యుత్ ఉద్యోగులపై దాడి.. నలుగురిపై కేసు నమోదు

అనంతపురం జిల్లాలో విద్యుత్‌ బకాయిల వసూళ్లు వివాదాస్పదంగా మారాయి. గుంతకల్లు మండలం శంకరబండ గ్రామంలో విద్యుత్ బిల్లుల కోసం వెళ్లిన సిబ్బందిపై గ్రామస్థులు తిరగబడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడమే కాకుండా, ఫోన్ చేసినా స్పందించలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో బిల్లులు చెల్లించకపోతే..గ్రామం మెుత్తానికి విద్యుత్ ఎలా నిలిపివేస్తారంటూ ఉద్యోగులను నిర్బంధించారు.

రైతులు, విద్యుత్ ఉద్యోగుల వివాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. గ్రామానికి వచ్చి సిబ్బందిని విడిపించారు. తమపై దాడి చేశారంటూ ఉద్యోగులు రైతులపై కేసు పెట్టగా.... అకాల విద్యుత్ కోతలతో పంటకు నీరు పెట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు తమ వాదన వినిపించారు.

ABOUT THE AUTHOR

...view details