ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సోలార్ ప్లాంట్​కు భూములివ్వం..నీళ్లిస్తే వ్యవసాయం చేసుకుంటాం' - anantapur latest news

అనంతపురంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు ఇవ్వబోమని రైతుల ఆందోళన చేశారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు ఇస్తే వ్యవసాయం చేసుకుంటామని విన్నవించారు.

anantapu solar plant land issue
సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు ఇవ్వబోమని రైతులు

By

Published : Nov 29, 2020, 9:51 AM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామ పరిసరాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం వందలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. దీనిపై రైతులతో చర్చించేందుకు కళ్యాణదుర్గం ఆర్డీఓ రామ్మోహన్ ఇతర రెవెన్యూ అధికారులతో కలిసి స్థానిక సచివాలయానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నూతిమడుగు గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. తమ పొలాలు సోలార్ ప్లాంట్​కు ఇవ్వబోమని చెప్పారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు ఇస్తే వ్యవసాయం చేసుకుంటామని నినాదాలు చేశారు. అధికారులు రైతులతో చర్చించి... ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details