ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VIRAL VIDEO: హంద్రీనీవా కాలువకు గండి... బాధిత రైతు వీడియో వైరల్‌ - anantapur district latest news

అనంతపురం జిల్లా రాచపల్లి గ్రామ సమీపంలో హంద్రీనీవా ప్రధాన కాలువకు కొందరు వ్యక్తులు గండికొట్టారు. ప్రధాన కాలువకు కింది ప్రాంతంలోనే చెరువు ఉండటంతో గండి కొడితే... నీరు అందులోకి చేరుతుందని భావించి మంత్రి అనుచరులు, గ్రామస్థులతో కలిసి ఇలా చేశారని రాచపల్లి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ చర్యతో 20 ఎకరాలలోని పంటలు నీట మునగడంతోపాటు, పొలాలు కోతకు గురవుతున్నాయని బాధితరైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఓ రైతు సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Handrineva cana
హంద్రీనీవా కాలువకు గండి

By

Published : Oct 5, 2021, 9:29 AM IST

హంద్రీనీవా కాలువకు గండి... బాధిత రైతు వీడియో వైరల్‌

అనంతపురం జిల్లా హిందూపురం మండలం రాచపల్లి వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువకు కొందరు వ్యక్తులు గండికొట్టారు. పరిగి మండలం ఉటుకూరు చెరువుకు నీటిని తరలించేందుకే ఇలా చేశారంటూ స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి శంకరనారాయణ నియోజకవర్గమైన పెనుకొండ పరిధిలో ఈ చెరువు ఉంది. దీనికి హంద్రీనీవా నీటిని అందించేందుకు అనుమతిలేదు. కాలువలు కూడా లేవు. ప్రధాన కాలువకు కింది ప్రాంతంలోనే చెరువు ఉండటంతో గండి కొడితే... నీరు అందులోకి చేరుతుందని భావించి మంత్రి అనుచరులు, గ్రామస్థులతో కలిసి ఇలా చేశారని రాచపల్లి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

వీరి చర్యతో 20 ఎకరాలలోని పంటలు నీట మునగడంతోపాటు, పొలాలు కోతకు గురవుతున్నాయని, అందులో తన 5 ఎకరాల పొలముందని బాధిత రైతు వేమారెడ్డి వాపోయారు. ఈ ఏడాది జనవరిలోనూ ఇలాగే చేశారని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి శంకరనారాయణ ఫోన్‌ చేసి, న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో నమ్మినట్లు ఆయన తెలిపారు. మరోసారి దౌర్జన్యంగా గండి కొట్టారని, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వాపోయారు. ఈ విషయంలో హైకోర్టు సైతం ఆశ్రయించానన్నారు. చివరికి ఆ రైతు సెల్ఫీ వీడియో తీసి సోమవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. కాలువ ధ్వంసంపై హంద్రీనీవా జేఈ చౌడప్పను వివరణ కోరగా... గండి కొట్టిన విషయం నిజమేనని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. పొలం కోతకు గురైంది తనకు తెలియదన్నారు.

ఇదీ చదవండి

నేలపై కూర్చొని సమస్యలు విన్న సబ్​కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details