అనంతపురం జిల్లా గుడిబండ మండలం రాళ్లపల్లి యూనియన్ బ్యాంక్ శాఖ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వడ్డీ తీసుకుని.. బ్యాంకు రుణాల నవీకరణ చేయాలని బ్యాంకు ముందు బైఠాయించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా.. బ్యాంకు వద్ద కాకుండా గతంలో మాదిరి రైతుల వద్దకే బ్యాంకు ప్రతినిధులు రావాలనీ.. కేవలం వడ్డీతోనే రెన్యూవల్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను ఉన్నతాధికారులకు తెలిపి.. వారి ఆదేశాలు పాటిస్తామని మేనేజర్ చెప్పటంతో, రైతులు ఆందోళన విరమించారు.
రుణాలు నవీకరించాలని బ్యాంక్ ఎదుట రైతుల బైఠాయింపు - రాళ్లపల్లి రైతుల ఆందోళన న్యూస్
వడ్డీ చెల్లించుకుని బ్యాంకు రుణాలు నవీకరించాలని.. బ్యాంకు ముందు రైతులు బైఠాయించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాళ్లపల్లిలో జరిగింది.
బ్యాంకు ముందు రైతులు బైఠాయింపు