ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులకు గండి పడింది...ప్రమాదం పొంచి ఉంది... - చెరువులకు గండి పడింది...ప్రమాదం పొంచి ఉంది...

కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండుతున్నాయని ఆనందపడాలో వాటికి పడిన గండిన పూడ్చకపోవటంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆందోళ చెందాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు అనంతపురం రైతులు.

చెరువుకు గండి

By

Published : Sep 25, 2019, 11:38 AM IST

చెరువుకు గండి

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో పలు చెరువులు భారీ వర్షాలకు నిండి జలకళ సంతరించుకున్నాయి. కానీ చెరువులకు పడిన గండి వలన నీరు క్రమంగా లోతట్టు ప్రాంతాలకు పోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు ఏ క్షణం ఉగ్రరూపం దాల్చుతాయోనని భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో ఉన్న చెరువులకు పడిన గండిని సంబంధిత అధికారులు పూడ్చి నీటిని నిల్వ ఉండేటట్లు చర్యలు తీసకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న పులికల్లు, రామసాగరం, గోల్డెన్ చెరువులకు పడిన గండ్లు త్వరగా పూడ్చివేసేటట్లు చర్యులు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details