ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుపై ఎలుగుబంటి దాడి..తీవ్రగాయాలు - చాపిరి గ్రామంలో రైతుపై ఎలుగుబంటి దాడి

ఎలుగుబంటి దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

bear attack
ఎలుగుబంటి దాడి

By

Published : Apr 17, 2021, 8:43 PM IST

అనంతపురం జిల్లా చాపిరి గ్రామంలో ఎలుగుబంటి దాడి చేయటంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. చాపిరి గ్రామంలో తన వేరుశనగ పంట పొలం వద్ద రోజు మాదిరిగానే కాపలాకు వెళ్లాడు. తెల్లవారుజామున పొదల్లో నుంచి వచ్చిన ఎలుగుబంటి తనపై దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఇరుగుపొరుగు రైతులు వచ్చి కేకలు వేయడంతో వదిలి వేసిందన్నారు. గాయాలైన తనను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు బాధితుడు వివరించాడు. రైతులతో అటవీశాఖ సిబ్బంది పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details