అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తిప్పేస్వామి స్థానికంగా ఉండే ప్రభుత్వ(పోరంబోకు) భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షంతో పంటంతా కొట్టుకుపోయింది. దీంతో తిప్పేస్వామి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పు చేసి సాగు చేసిన పంట పూర్తిగా కొట్టుకుపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. సమీపంలోని పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుని భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
అప్పు తెచ్చి పంట సాగు చేశాడు... పంట చేతికొస్తుందన్న సమయంలో ప్రకృతి తన ప్రకోపాన్ని చూపింది. కాలం కాని కాలంలో వర్షం రూపంలో పంటను నాశనం చేసింది. ఆ రైతును ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పింది. నిండు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా బొల్లనగుడ్డం గ్రామంలో జరిగింది.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య