అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలో అప్పులబాధ తాళలేక సుబ్బయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుబ్బయ్య మూడు ఎకరాలలో చీనీ తోట సాగు చేస్తున్నాడు. వర్షాలు లేకపోవడంతో 10 బోర్లు వేసినా నీరు పడలేదు. 10 లక్షల వరకూ వాటి కోసం అప్పు చేశాడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయన్న బాధ ఓవైపు.. పంట ఎండిపోతుందన్న బాధ మరోవైపు.. వెరసి సుబ్బయ్యలో సహనం నశించింది. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న సుబ్బయ్యను బంధువులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. అయితే మరణించిన అనంతరం తన కళ్ళు ఇతరులకు దానం చేయాలన్న సుబ్బయ్య కోరికని బంధువులు వైద్యులకు చెప్పారు. విషం తాగడం వల్ల కుదరదని వైద్యులు తెలిపారు. తాను చనిపోయినా కళ్లు దానం చేయాలనుకున్న రైతు ఆలోచనకు అభినందిస్తున్నారు.
నీళ్లు పడలేదు... బతుకు 'పంట' పండలేదు - రైతు ఆత్మహత్య
పది బోర్లు వేశాడు.. నీళ్లు పడలేదు...పంట పండలేదు. అప్పులు పెరిగాయి.. సహనం తగ్గింది. అందుకేనేమో ఆ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైతు ఆత్మహత్య