అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మద్దుల చెరువుగ్రామానికి చెందిన రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓబులేసు అనే రైతు తనకున్న ఐదు ఎకరాల పొలంలో మూడు బోరుబావులు తవ్వించి, మూడు లక్షల వరకు నష్టపోయాడు. బోరు బావుల్లో నీరు పడకపోవడం కారణంగా అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీనికి తోడు కుటుంబ పోషణ భారం కావడం వల్ల ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పుల బాధతో రైతు బలవన్మరణం - anantapuram district latest news
అప్పులు బాధ తట్టుకోలేక అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మద్దులచెరువు గ్రామానికి చెందిన రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య