అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం చంద్రచర్ల గ్రామానికి చెందిన రైతు మోహన్... తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో బోర్లు వేయించి అప్పుల పాలయ్యాడు. కుటుంబ పోషణ కోసం ఉపాధి పనులకు వెళ్తున్నాడు. మంగళవారం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య - అనంతపురం జిల్లా క్రైం
లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేయించాడు. బోర్లలో నీళ్లు ఇంకిపోవడంతో పంట సరిగ్గా పండలేదు. అప్పలు ఎలా తీర్చాలో మార్గం కనిపించలేదు. ఫలితంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ యువరైతు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య