అనంతపురం జిల్లా పాలవాయి గ్రామ సమీపంలో గంగన్న అనే రైతు వన్యప్రాణుల నుంచి పంటను కాపాడుకోవడానికి వినూత్నంగా అలోచించి తన పొలం చుట్టూ రంగు రంగుల చీరలు కట్టాడు. తమ పొలం పక్కనే కొండ ఉందని.. అక్కడి నుంచి ఎలుగుబంట్లు, అడవి పందులు మూకుమ్మడిగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చీరలు కట్టడం వల్ల కొంతైనా అడవి జంతువుల బాధ తప్పుతుందని చెబుతున్నాడు.
అడవి జంతువుల నుంచి రక్షణగా పొలం చుట్టూ చీరలు - అనంతపురంలో పొలాన్ని చీరలతో కాపాడుకుంటున్న రైతు
అనంతపురం జిల్లా పాలవాయి గ్రామ సమీపంలో... వన్యప్రాణుల నుంచి తన పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్నంగా అలోచించాడు. తన పొలం పక్కనే కొండ ఉండడం వల్ల జంతువులు పొలంలోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని... వాటి నుంచి తన పొలాలను కాపాడుకునేందుకు చీరలను ఆసరాగా చేసుకున్నాడు.
పొలం చుట్టూ చీరలను కట్టిన రైతు