అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో రామాంజనేయులు, నాగరాజు అనే రైతులు బోర్లలో పుష్కలంగా నీరు ఉందని మూడు ఎకరాల్లో అరటి పంట సాగు చేశారు. పుష్కరంగా వర్షాలు కురిశాయి భూగర్భ జలాలకు ఎలాంటి లోటు లేదనుకున్నారు. అయితే ఇటీవల ఎండల తీవ్రత పెరగడం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. అయినప్పటికీ భూమాతను నమ్ముకున్న రైతన్నలు లక్షలాది రూపాయలు వెచ్చించి మరో ఐదు బోర్లు కూడా వేయించారు. వీటిలో కూడా నీరు పడకపోవడంతో చేసేది లేక మూడు ఎకరాల పంట తీసేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీరు అడుగంటి.. అరటి పంట ఎండింది.. - అనంతపురంలో ఎండ తీవ్రత తాజా వార్తలు
గత ఏడాది వర్షాలు బాగా పడ్డాయని బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయని ఆశపడ్డ రైతులకు నిరాశే ఎదురైంది. పుష్కలంగా నీరుంది కదా అని అనంతపురంలో మూడు ఎకరాల్లో అరటి పంట వేశాడా రైతు. ఎండ తీవ్రత పెరగడం, భాగర్భ జలాలు అడుగంటి తీవ్రంగా నష్టపోయాడు.
భూగర్భ జలాలు లేక అరటి పంట నష్టపోయిన రైతులు
ఇవీ చూడండి...