ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిహారం చెల్లించకుండా రోడ్డు పనులు.. రైతు ఆందోళన - గాండ్లపెంటలో పరిహారం చెల్లించకుండా రోడ్డు వేశారని కోర్టుకెళ్లిన రైతు

farmer had approached the court: కాలిబాట కోసం రైతు కుటుంబం దారిని వదిలింది... దాన్ని ఆసరాగా చేసుకుని ఆ మార్గంలో తారురోడ్డు వేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు... పరిహారం ఇవ్వకుండానే పనులు చేపట్టారు.. ఇదే విషయాన్ని రైతు.. అధికారులు, కాంట్రాక్టర్​ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ఆ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈలోపే అధికారులు రంగంలోకి దిగి రోడ్డు పనులు చేపట్టడంతో రైతు ఆందోళనకు దిగాడు.

farmer had approached the court
పరిహారం చెల్లించకుండా రోడ్డు పనులు

By

Published : Mar 11, 2022, 2:14 PM IST

farmer had approached the court: అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కత్తివారిపల్లికి చెందిన చెన్నకేశవరెడ్డి భూమిలో మునగలవారిపల్లి నుంచి కత్తివారిపల్లికి రహదారి మంజూరైంది. పనులు ప్రారంభానికి ముందే రైతు తన పొలం నుంచి రోడ్డు వేయవద్దంటూ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. తప్పనిసరైతే పరిహారం ఇవ్వాలని కోరాడు. ఇవేమీ పట్టించుకోని అధికారులు.. హడావిడిగా రోడ్డు పనులు ప్రారంభించారు.

farmer had approached the court: ఆవేదన చెందిన రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. రోడ్డుపనులు నిలిపివేయాలని కోరాడు. ఈలోపే కాంట్రాక్టర్...​ రైతు పొలంలో రోడ్డు కోసం ఇసుక, కంకరు రాళ్లను పోయడంతో... ఆగ్రహించిన రైతు జేసీబీ సాయంతో తన పోలం వద్ద వేసిన కంకరు రాళ్లను తవ్వేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని... రోడ్డును తవ్వొదంటూ రైతు చెన్నకేశవరెడ్డితో వారించారు. మరోసారి అధికారులకు మీ అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు. ఈ క్రమంలో పోలీసులు, రైతు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. రైతుకు నచ్చజెప్పిన పోలీసులు... జేసీబీని అక్కడి నుంచి పంపేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details