పంట పండించేందుకు ఒంటిలో సత్తువ లేకపోయినా... సాగు చేయాలనే దృఢసంకల్పం ఆ వృద్ధుడిది. చేతిలో డబ్బు లేకపోయినా... అప్పు చేసైనా పంట పండిస్తున్నాడు. బ్యాంకులు ఇచ్చే రుణాల వివరాలను రెన్యువల్ చేయించేందుకు తోటి రైతులతో కలిసి వెళ్లిన అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా దిగువపల్లిలో జరిగింది.
పంట రుణాల కోసం వెళ్లాడు... ప్రాణాలు విడిచాడు - faremer died in bank
పంట రుణాల రెన్యువల్ కోసం వెళ్లిన వృద్ధుడు బ్యాంకులోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచిన ఘటన అనంతపురం జిల్లా దిగువపల్లిలో జరిగింది.
బ్యాంకులోనే చనిపోయిన రైతు
దిగువపల్లికి చెందిన లక్ష్మన్న అనే రైతు పంట రుణాల రెన్యువల్ కోసం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లారు. రెన్యువల్ పత్రాలపై సంతకాలు చేసిన లక్ష్మన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి రైతులు గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పు తీసుకొస్తాడని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల్లో లక్ష్మన్న మరణ వార్త విషాదం నింపింది.