ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'టెంపో' బొల్తా...ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు - farmer died, five members injured in road accident at papireddypalli of ananthpuram

టెంపో వాహనం బొల్తా పడి ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లి వద్ద జరిగింది.

farmer died, five members injured  in road accident at papireddypalli of ananthpuram
'టెంపో' బొల్తా...ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

By

Published : Nov 29, 2019, 7:54 AM IST

'టెంపో' బొల్తా...ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై టెంపో వాహనం బొల్తా పడింది. ఈ ఘటనలో ఒక రైతు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మవరం మండలం మాలగుండ్లపల్లికి చెందిన హరి...కూరగాయలను టెంపో వాహనంలో బెంగళూరు సిటీ మార్కెట్​కు తరలించేందుకు బయలుదేరాడు. మేమూ వస్తామంటూ మరో నలుగురు రైతులు ఆ వాహనంలో వెళ్లారు. ఈ క్రమంలో పాపిరెడ్డిపల్లి వద్ద వాహనం అదుపు తప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో హరి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు సహా టెంపో వాహన డ్రైవర్ తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details