ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేస్తుండగా యువ రైతు ప్రమాదవశాత్తు రోటవేటర్ కిందపడి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. రాయదుర్గం మండలం రేకులకుంట గ్రామానికి చెందిన వీరేశ్ అనే యువకుడు ట్రాక్టర్ రోటవేటర్ కిందపడి మృతి చెందాడు. తనకున్న వ్యవసాయ పొలంలో రోటవేటర్ మీద కూర్చొని పొలం పనులు పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు యంత్రం మధ్యలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. కొనఊపిరితో ఉన్న వీరేశ్ ను హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. బంధువుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం ఎస్ ఐ బాలరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
DEAD: ట్రాక్టర్ కిందపడి యువ రైతు మృతి - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో విషాదం చేసుకుంది. పొలం పనులు నిర్వహిస్తున్న ఓ యువరైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటవేటర్ కిందపడి మృతి చెందాడు.
DEAD