అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం కొడకన్డల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వర్షానికి వేరుశనగ పంట దెబ్బ తినటంతో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో విషపు గుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
వరుణుడి కన్నెర్ర.. రైతు ఆత్మహత్య - బత్తలపల్లిలో రైతు ఆత్మహత్య
అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం కొడకన్డల గ్రామంలో వేరుశనగ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వర్షం కారణంగా పంట పూర్తి నాశనమైనందున్న మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
బత్తలపల్లిలో రైతు ఆత్మహత్య
రామకృష్ణ అనే రైతు తనకున్న ఐదెకరాల పొలంలో వేరుశనగ పంట సాగు చేశాడు. మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని అందులోనూ వేరుశనగ పంట వేశాడు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలంలోనే వేరుశనగ పంట తడిసి పనికిరాకుండా పోవడంతో రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'భూముల రీసర్వే.. ప్రతీ కమతానికీ ప్రత్యేక గుర్తింపు నెంబర్'