అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ తైక్వాండో ఇనిస్టిట్యూట్ క్రీడాకారులు...తెలంగాణ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఏకంగా పది బంగారు పతకాలు, రెండు వెండి, మూడు కాంస్య పతకాలు సాధించి.. ఔరా అనిపించారు. వివిధ రకాల పోటీల్లో వీరు ఎన్నో పతకాలు సాధించి... తమ పట్టణానికి ఎంతో పేరు తీసుకువచ్చారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తైక్వాండో పోటీల్లో గుత్తి క్రీడాకారుల అద్భుత ప్రదర్శన - gooty latest news
అసలే పేదరికం. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు. ఇవన్నీ వారికి అడ్డు కలిగించలేదు. పట్టుదలతో ప్రయత్నిస్తే అద్భుత విజయాలను సాధించవచ్చని నిరూపించారు ఈ బాలురు. తెలంగాణలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో అద్భుత ప్రతిభ కనపరిచి ఔరా అనిపించుకున్నారు అనంతపురం జిల్లా గుత్తి క్రీడాకారులు.
తైక్వాండో పోటీల్లో గుత్తి క్రీడాకారుల అద్భుత ప్రదర్శన