హీరో వెంకటేశ్‌ను చూసేందుకు అభిమానుల ఆసక్తి - hero Venkatesh in kalyanadurgam
గతేడాది ఎఫ్ 2, వెంకీమామ చిత్రాలతో హిట్లు అందుకున్న వెంకటేశ్.... ప్రస్తుతం తమిళ సినిమా 'అసురన్' రీమేక్‌లో నటిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పట్టాభి రామాలయంలో జరుగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ సన్నివేశాన్ని ఆలయంలో చిత్రికరించారు. రామాలయంలో విక్టరీ వెంకటేశ్‌ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. షూటింగ్ అనంతరం వెంకటేశ్ అభిమానులకు అభివాదం చేశారు.