ప్రియుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ధర్నా నిర్వహించారు. పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చాపిరికి చెందిన రఘు.. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని నమ్మించి మోసంచేసి 24వతేదీన హత్య చేశాడు. యువతి మృతదేహాన్ని తుంగభద్ర కాలువలో కనేకల్ ప్రాంతంలో పడేయగా..పోలీసులు గుర్తించి పోస్టుమార్టం నిర్వహించారు. రఘు మరికొంత మందితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడని అమ్మాయి బంధువులు... పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. సీఐ శివశంకర్ నాయక్ వారికి నచ్చజెప్పి ఇప్పటికే కేసు నమోదు చేశామని తెలిపారు. మరికొంత సమాచారాన్ని నిందితుడి ద్వారా రాబడుతున్నామని... లిఖితపూర్వకంగా మరింత సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువతి బంధువులకు పోలీసులు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని... విచారణ తరువాత మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.
ప్రియుడి చేతిలో హత్యకు గురైన యువతి.. కుటుంబసభ్యుల ధర్నా - chapiri young woman murder news
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ప్రియుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రియుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యుల ధర్నా