కన్నవారిని కోల్పోయాక వారు సర్వస్వం పోగొట్టుకున్నట్లు భావించారు. అనంతపురంలోని వేణుగోపాల్ నగర్‌లో తిరుపాల్ శెట్టి, అక్క విజయలక్ష్మి, చెల్లి కృష్ణవేణి అనే ముగ్గురు తోబుట్టువులు జీవిస్తున్నారు. 2016లో తిరుపాల్ శెట్టి తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబమంతా ఆ బాధ నుంచి బయటకు వచ్చేలోగా.. 2017లో తల్లి కూడా మరణించారు.తిరుపాల్ శెట్టి తండ్రి కొంత డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేశారు. తిరుపాల్ నెలకోసారి బ్యాంకుకు వెళ్లి వడ్డీ విత్‌డ్రా చేసుకుని వచ్చేవారు. రోజూ భోజనం ప్యాకెట్, తాగునీరు కోసం మాత్రమే బయటకు వచ్చేవారు. విద్యుత్ బిల్లు కూడా చెల్లించకపోవటంతో, కనెక్షన్ కట్ చేశారు. ఈ విషయాన్ని కూడా పట్టించుకోకుండా చీకట్లోనే జీవిస్తున్నారు.
మూడేళ్లుగా సమాజానికి దూరంగా ఇంట్లోనే జీవనం
అమ్మా, నాన్నే తమకు సర్వస్వంగా భావించేవారు. అలాంటి తల్లిదండ్రులను కోల్పోవడంతో వారంతా తీవ్రంగా కుంగిపోయారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు తోబుట్టువుల జీవితం హృదయవిదారకంగా మారింది. తల్లిదండ్రులు లేరనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక.... వాస్తవ ప్రపంచంలో బతకలేక... మూడేళ్లుగా సమాజాంతో సంబంధం లేకుండా ఇంట్లోనే జీవిస్తున్నారు.స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు తలుపులు తెరిచి చూడటంతో తీవ్ర దుర్వాసన మధ్య స్పృహ లేకుండా ఉన్నారు.