ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమ భూమి వేరొకరికి బదిలీ చేశారని బాధితుల ఆందోళన.. ఉద్రిక్తత - Anantapur District

Family Agitation: తమకు చెందిన ఆస్తి వేరొకరికి బదిలీ చేశారని ఓ కుటుంబం అనంతపురం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. బాధితుల సమస్యను పట్టించుకోని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. పోలీసులను పిలిపించి వారిని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

Family Agitation In Anantapur
రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన

By

Published : Sep 27, 2022, 4:48 PM IST

Family Agitation In Anantapur: అక్రమ రిజిస్ట్రేషన్ చేసి తమ ఆస్తిని వేరొకరికి బదిలీ చేశారని ఆరోపిస్తూ ఓ కుటుంబం అనంతపురం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. అనంతపురం గ్రామీణ మండలం కక్కలపల్లి గ్రామ పరిధిలోని తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని,.. ఆ పత్రాలను ఫ్లెక్సీపై ముద్రించి బాధితులు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయించాలని బాధితుల బంధువులు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు చేపట్టారు. దీంతో కొద్దిసేపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

బాధితులు తప్పు జరిగిందని ఆందోళన చేస్తున్నప్పటికీ.. ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. అవేవీ పట్టించుకోకుండా పోలీసులను పిలిపించారు. బాధితులను పోలీసులు ఈడ్చి పడేయటంతో మహిళ తలకు తీవ్ర గాయమైంది. రక్తం కారుతున్నా కనీసం ప్రాథమిక వైద్యం కూడా చేయించకుండా బాధితులను పోలీసులు నాల్గో పట్టణ స్టేషన్​కు తీసుకెళ్లారు. విచారణ పేరుతో బాధితుల సెల్​ఫోన్లు లాక్కొని, స్టేషన్​లో కూర్చోపెట్టడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ రిజిస్ట్రేషన్ చేసి తమ భూమి వేరొకరికి బదిలీ చేశారని ఆందోళన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details