Fake Votes Registration in Anantapur : అది అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని ప్రసన్నాయపల్లి. శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి నంబర్ 1-1. అందులో నివాసముండే కుటుంబం పదేళ్ల క్రితం వలస వెళ్లిపోయింది. అయితేనేం ఇందులో 47 మంది ఓట్లర్లు ఉన్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు. ఇక్కడకనిపిస్తున్నది శింగనమల నియోజకవర్గంలోని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు. కళాశాల పేరుతో 2019 ఎన్నికల ముందు 21 ఓట్లు చేర్చారు. కళాశాల చుట్టుపక్కల గృహాలే లేవు. ఆ ఓట్లను ఇప్పటికీ తొలగించలేదు.
నియోజకవర్గంలోనూ ఇంటి నంబరు లేని ఓటర్లు 15 వందల6 మంది ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే '00' ఇంటి నంబర్‌తో రాచానపల్లిలో 208 ఓట్లు, కక్కలపల్లికాలనీ పంచాయతీలో 186, పాపంపేట పంచాయతీలో 236, కురుగుంట పరిధిలో 80 ఓట్లు నమోదయాయ్యి. ఇలా సుమారు 2 వేల 498 ఓట్లు నమోదు చేశారు. మరో వైపు తప్పుడు నంబర్లతోనూ వేలాదిగా జాబితాలో చేర్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10 కంటే ఎక్కువ ఓట్లు కలిగిన ఇళ్లు 958 ఉన్నాయి. వీటిలో దాదాపు 60 శాతం సుమారు 10 వేల వరకు దొంగ ఓట్లు నమోదు చేసినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. ఇంటి నంబర్ లేకుండా నమోదు ఎలా చేస్తారనే దానిపై అధికారుల వద్ద సమాధానం లేదు. సాంకేతిక తప్పిదాల వల్ల జరిగి ఉంటుందని మండల రెవెన్యూ అధికారులు సమాధానం దాటవేస్తున్నారు..
Fake votes: విచ్చలవిడిగా దొంగఓట్లు నమోదు.. ఒకే ఇంట్లో ఏకంగా 47
అధికార పార్టీ నేతలకు వత్తాసు : కీలక నియోజకవర్గమైన రాప్తాడు అభ్యర్థి గెలుపును అనంతపురం గ్రామీణ మండలం ఓట్లు నిర్ణయిస్తాయి. ఈ మండలంలోని 21 పంచాయతీలు అనంతపురం నగరంతో కలిసిపోయి 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. నగరంలో ఉండే వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్లను ఆయా పంచాయతీల జాబితాలోనూ చేర్చారు. నగరంలో కలిసిపోయి ఉండటంతో దొంగ ఓటర్లను గుర్తించడం అంత సులువు కాదు. కొందరు అధికారులు, వాలంటీర్లు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ దొంగ ఓట్లు సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Bogus Votes in AP: ఇబ్బడిముబ్బడిగా బోగస్ ఓట్లు.. ఏ బూత్ చూసినా అవే