ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్లు ఇప్పిస్తానంటూ నిజమైన వాలంటీర్ ఇంటికి వెళ్తే..! - ఏపీలో వాలంటీర్ వ్యవస్థ వార్తలు

వాలంటీర్... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసుకొచ్చిన వ్యవస్థ. ప్రభుత్వ పథకాలు ఏదైనా అందాలంటే వాలంటీర్​ను సంప్రదించాల్సిందే. సరిగ్గా ఇదే వ్యవస్థను ఆసరాగా చేసుకోని అనంతపురం జిల్లాలో నకిలీ వార్డు వాలంటీర్​ అవతారమెత్తాడు ఓ వ్యక్తి. వాలంటీర్ పేరుతో ప్రజల వద్ద నుంచి నగదు దోచుకునే పనిలో పడ్డాడు. కానీ ఈ కేటుగాడికి అనుకోని షాక్ తగిలింది. ఆ షాక్ ఏంటంటే...?

Fake Voluntary arrested in anathapurama district
Fake Voluntary arrested in anathapurama district

By

Published : Dec 25, 2019, 10:41 AM IST

పింఛన్లు ఇప్పిస్తామని నిజమైన వాలంటీర్​ ఇంటికి వెళ్తే...!

వార్డు వాలంటీర్ పేరుతో ప్రజల వద్ద నుంచి నగదు దోచుకుంటున్న ఓ నకిలీ వాలంటీర్.. చివరికి అసలు వాలంటీర్​కే చిక్కాడు. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.​ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సుంకులమ్మపాలెం కాలనీకి చెందిన వెంకటేశ్ అనే యవకుడు చికెన్ పకోడా బండి వ్యాపారాన్ని చేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాందించాలని భావించి మరో ఇద్దరు యువతులతో కలిసి నకిలీ వార్డు వాలంటీర్ల అవతారమెత్తాడు. పట్టణంలోని పలు కాలనీలు తిరుగుతూ తాము వార్డు వాలంటీర్లమని ప్రచారం మొదలు పెట్టాడు. 'మీ పింఛను సొమ్ము పొకుండా ఉండాలన్నా, కొత్త పింఛన్లు కావాలన్నా ఒక్కో దరఖాస్తుకు కొంత రుసుం చెల్లించాలి' అంటూ వసూళ్లు మొదలుపెట్టారు.

డామిట్... కథ అడ్డం తిరిగింది..!

ఇలా వారం రోజులుగా పట్టణంలోని ఐదు వార్డుల్లో డబ్బులు వసూలు చేశారు. ఒక్కో దరఖాస్తుకు 300 నుంచి వెయ్యి రూపాయల వరకు దండుకున్నారు. ఇలా వసూలు చేసుకుంటూ వెళుతూ ఆ వార్డులోని అసలైన వార్డు వాలంటీర్ ఇంటి వద్దకు వెళ్లి మాయ మాటలు చెప్పడం ప్రారంభించారు. వెంటనే సదరు నిజమైన వాలంటీర్... పురపాలక అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే లోపు నకిలీ బృందంలో ఉన్న ఇద్దరు యువతులు గమనించి పక్కకు జారుకున్నారు. ప్రధాన సూత్రధారి అయిన వెంకటేష్ అడ్డంగా ఋక్కైపోయాడు. అతని నుంచి 60 దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు. పురపాలిక అధికారులు వెంకటేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

క్రీస్తు జన్మదినం.. చర్చిల్లో అంబరాన్నంటిన సంబరం

ABOUT THE AUTHOR

...view details