అంతర్రాష్ట్ర నకిలీ పోలీసు ముఠా అరెస్ట్ - నకిలీ పోలీసు ముఠా అరెస్ట్
నకిలీ పోలీసు అవతారమెత్తి.. అమాయక ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర చీటింగ్ ముఠాను అనంతపురం జిల్లా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
![అంతర్రాష్ట్ర నకిలీ పోలీసు ముఠా అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2639680-475-a335f78c-64f3-4e28-8532-2c3399f70310.jpg)
నకిలీ పోలీసు అవతారమెత్తి.. అమాయక ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్రచీటింగ్ ముఠాను అనంతపురం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరుకు చెందిన డేనియల్ ఎసెక్స్, ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాకు చెందిన మదన్ శెట్టి, అనే ఇద్దరు వ్యక్తులు ఓ ప్రైవేటు సెక్యూరిటీఏజెన్సీని నిర్వహిస్తుండేవారు. ఏజెన్సీ ద్వారా వచ్చే డబ్బు సరిపోక, సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. పోలీసుల కార్యకలాపాలపై వీరికి ఉన్న అవగాహనను ఆసరగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడ్డారు.
ట్యాక్సీ డ్రైవర్ గా ఉన్న శేఖర్‌ను పరిచయం చేసుకుని నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు. పోలీసు దుస్తులు ధరించి, రెండు బేడీలు, లాఠీలు, వాకీ టాకీలు పట్టుకుని అమాయక ప్రజలకు వల వేసేవారు. కదిరి పట్టణానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తికి, తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని నమ్మించారు. అతని వద్ద నుంచి 7 లక్షల నగదు, బంగరాన్ని లాక్కున్నారు.
ఏడాదిన్నర క్రితం కర్ణాటకలోని బంగారుపేటలో, నాలుగు నెలల క్రితం చిత్తూరు జిల్లాలో ఈ తరహా మోసాలకు పాల్పడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక బృందాన్ని నియమించారు. సీసీఎస్ పోలీసులు వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గరు నిందితులను పట్టుకోవాల్సి ఉంది. వీరి వద్ద నుంచి 7లక్షల నగదు, క్వాలీస్ వాహనం, రెండు బేడీలు, 14నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు, 2వాకీటాకీలు, 3లాఠీలు, పోలీసు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు