ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మోసగాడిని అనంతపురం జిల్లా కదిరి పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీనివాసులు ఆదాయపు పన్ను శాఖ అధికారిగా చెప్పుకుంటూ నిరుద్యోగులను మోసం చేసాడు. అంతేగాక వారి వద్దనుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. కొందరు యువకులకు అతనిపై అనుమానం వచ్చి.. ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయగా, కదిరికి వస్తే డబ్బులు ఇస్తానంటూ నిందితుడు తెలిపాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో శ్రీనివాసులుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మోసాలకు పాల్పడుతున్న నకిలీ అధికారి అరెస్ట్ - fake officer srinivasulu arrested
నకిలీ అధికారిగా చలామణి అవుతూ, మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.
fake officer srinivasulu arrested by police at ananthpuram district