ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ఓ ముఠాను అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి రమేష్ అతనితోపాటు ఆంజనేయులు, రాధాకృష్ణ, సందీప్ అనే నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి... ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఉరవకొండకు చెందిన కౌశల్ బాబు, రమేష్ల దగ్గరి నుంచి 15 లక్షలు తీసుకున్నారు. వారికి నకిలీ నియామక పత్రాలు ఇచ్చారు. వారిద్దరూ విధుల్లో చేరేందుకు వెళ్లగా అవి నకిలీవని తేలింది. దాంతో ఆ ముఠాను డబ్బు తిరిగివ్వాలని నిలదీశారు. వారు సొమ్ము ఇవ్వకపోగా బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని ఇద్దిరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ వీరు 30 మంది నిరుద్యోగుల నుంచి సుమారు 50లక్షల వరకూ వసూలు చేశారని సీఐ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు... పోలీసులకు చిక్కారు... - fake jobs team arrest ananthapuram news
'మీకు ప్రభుత్వం ఉద్యోగం కావాలా.. అయితే మా వద్దకు రండి. డబ్బులివ్వండి మీకు వెంటనే ఉద్యోగం వచ్చేలా చేస్తా'మంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో సొమ్ము వసూలు చేసిన ముఠాను అనంతపురం ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో టోకరా.. ముఠాను పట్టుకున్న పోలీసులు