ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడు కేటుగాడు. మహామాయగాడు..

అతనో ఘరానా మోసగాడు. ఏ యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లనైనా తయారు చేయగలడు. ఒరిజనల్​కు ఏ మాత్రం తేడా లేకుండా హోలోగ్రామ్స్​ స్టిక్కర్స్​ను సైతం కాపీ కొట్టేవాడు. అంతేకాకుండా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన వాహనంపై పోలీస్ స్టిక్కర్​, సైరన్ వేయించుకుని తిరిగాడు. ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో పేరు మోసిన ఈ కేటుగాడిని అనంతపురం పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

fake certificate
fake certificate

By

Published : Feb 2, 2020, 7:38 AM IST

Updated : Feb 2, 2020, 12:28 PM IST

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుడు, విక్రేత గ్లెన్​బ్రిగ్స్​ను అనంతపురం జిల్లా పామిడి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. గుంతకల్లు పట్టణానికి చెందిన అతను జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు ఎలాంటి విద్యా సంస్థకు సంబంధించిన సర్టిఫికెట్​నైనా తయారు చేయడంలో సిద్ధహస్తుడు. కోర్సు డిమాండ్​ను బట్టి 5 వేల నుంచి 25 వేల వరకు వసూలు చేస్తాడు. తన అక్రమ వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా ఒక వాహనానికి పోలీస్ స్టిక్కర్, సైరన్ వేసుకుని తిరిగేవాడు. ఫ్యాక్షన్ హత్యలతో సంబంధం ఉన్న మరో నలుగురని ఇటీవల కలుపుకున్నాడు. గుంతకల్లు కేంద్రంగా సాగుతున్న వీరి వ్యవహారంపై పోలీసుల నిఘా ఎక్కువ కావటంతో తిరుపతికి మకాం మర్చారు. కొన్ని రోజుల తర్వాత గుంతకల్లుకు తిరిగి వస్తున్న క్రమంలో... పోలీసులు పక్కా సమాచారంతో వీరిని అరెస్టు చేశారు. పామిడి, పెద్ద వడగూరు పోలీసులు బృందంగా ఏర్పడి ముఠాను పట్టుకున్నారు.

గ్లెన్​బ్రిగ్స్​తో పాటు అప్పేచెర్ల ఫ్యాక్షన్ కేసులోని ప్రధాన నిందితుడు కాచగార్ల వేంకటేశ్ నాయుడు, ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 699 గ్రాముల బంగారం, పోలీస్ నేమ్ బోర్డుతో కూడిన ఇన్నోవా కారు, లక్షా 10 వేల నగదు, 11 మొబైల్ ఫోన్లు, 70 నకిలీ సర్టిఫికెట్లు, 100 పాస్ పోర్టు సైజు ఫోటోలు, కంప్యూటర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత మంది నకిలీ సర్టిఫికెట్ల ద్వారా లబ్ధి పొందారన్న దానిపై విచారణ చేపడతామని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు.

ఇదీ చదవండి:

యువతితో అసభ్య ప్రవర్తన.. పోలీసులపై వేటు

Last Updated : Feb 2, 2020, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details