అనంతపురం జిల్లాలో వైకాపా నాయకుడి ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం దిమ్మగుడిలో వైకాపా మహిళా ఎంపీటీసీ సభ్యురాలి కుటుంబానికి చెందిన కృష్ణయ్య ఇంట్లో ఆకర్షణీయ ప్యాకింగ్‌లో పలు రకాల నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు గ్రామ సచివాలయానికి సమాచారం అందింది. ఎలాంటి బిల్లులూ లేకుండా, పెద్దఎత్తున పత్తి విత్తన ప్యాకెట్లను నిల్వచేసి.. విక్రయాలు చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చింది.
అధికార పార్టీ నాయకుడి ఇంట్లో.. నకిలీ విత్తనాలు!
అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నాయకుడి ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలను అధికారులు గుర్తించారు. ఆకర్షణీయ ప్యాకింగ్‌లో 300 ప్యాకెట్లను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.5 నుంచి 3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
fake Catton seeds
దీంతో.. సచివాలయ గ్రామ వ్యవసాయ సహాయకుడితోపాటు సిబ్బంది వైకాపా నాయకుడి ఇంట్లో సోదాలు చేశారు. పలు రకాల ప్యాకింగ్‌లో ఉన్న 300 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను గుర్తించారు. వీటని గుట్టుగా రైతులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని.. వీటి విలువ రూ.2.5 నుంచి 3 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఇదీ చదవండి: