అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పోలీసుల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారి వాహనాలను కూడళ్లలో నిలిపేశారు.
మాస్కు ధారణపై అవగాహన..
అనంతరం మాస్కు ధారణపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారి చేత ఒకటో పట్టణ సీఐ బాల మద్దిలేటి ప్రతిజ్ఞ చేయించారు. మాస్కు ధరించేలా చైతన్య పరిచారు.