అనంతపురం జిల్లా బేళుగుప్ప మండలంలో తెదేపా మండల సీనియర్ నాయకుడు సీర్పి శంకరయ్య విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులకు ఫేస్ హెల్మెట్లను పంపిణీ చేశారు. కుసుమిత కిసాన్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కట్టడిలో ముందుండి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసు, వైద్య సిబ్బందికి ఫేస్ హెల్మెట్లు పంపిణీ - బేళుగుప్ప మండలం తెదేపా నేత తాజా వార్తలు
బేళుగుప్ప మండలంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వైద్యులకు తెదేపా సీనియర్ నాయకుడు సీర్పి శంకరయ్య ఫేస్ హెల్మెట్లను పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో వారి సేవలను గుర్తించి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
![పోలీసు, వైద్య సిబ్బందికి ఫేస్ హెల్మెట్లు పంపిణీ face helmets distributed by senior tdp leader in ananthapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8098356-166-8098356-1595243594192.jpg)
ఫేస్ హెల్మెట్లను పంపిణీ చేస్తున్న తెదేపా సీనియర్ నాయకుడు