ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులే లక్ష్యంగా.. మందుపాతర అమర్చిన మవోయిస్టులు - Explosives detected news today

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఏజెన్సీ ప్రాంత వాసులను మందుపాతర కలకలం సృష్టించింది. చర్ల ప్రధాన రహదారి ప్రాంతంలో మందుపాతరను వెలికితీసిన పోలీసులు.. బాంబు స్క్వాడ్ ద్వారా ముమ్మర తనిఖీలు చేపట్టారు.

మందుపాతర మందుపాతర

By

Published : Sep 19, 2020, 9:09 PM IST

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం-చర్ల ప్రధాన రహదారి ప్రాంతంలో గల తెగడ వద్ద పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరను వెలికితీశారు. అనంతరం నిర్వీర్యం చేశారు. ఇంకా పలుచోట్ల మావోయిస్టులు మందుపాతరలు అమర్చి ఉంటారనే నేపథ్యంలో బాంబు స్క్వాడ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.

ఆవిర్భావ వేడుకల నేపథ్యంలోనే..

ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టుల ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన రహదారి సమీపంలో మందు పాతరలను గుర్తించేందుకు పోలీసులు రహదారికి ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు.

ఇదీ చదవండి:కశ్మీర్​లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details