అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గాజులపల్లి, గొందిపల్లి గ్రామాల్లో నాటుసారా తయారుచేస్తున్నారన్న సమాచారంతో... తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టామని సి.ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - అనంతపురంలో నాటుసారా వార్తలు
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.
Excise police raids on raw liquor shops in ananthapuram