అనంతపురం జిల్లాలోని, గుంతకల్లు నియోజకవర్గ వ్యాప్తంగా గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల్లోని గ్రామాల సమీపంలోని... కొండ గుట్టల్లో ఏర్పాటు చేసిన సారా స్థావరాలపై ఎక్సైజ్, సివిల్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. 3 వేల 75 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. నాటుసారా అమ్ముతున్న 8 మందిని అరెస్టు చేసి వారి నుంచి 53 లీటర్ల నాటు సారా, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎవరైనా నాటుసారా నిల్వ ఉంచినా, తయారు చేసినా,కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సారా స్థావరాలపై పోలీసుల దాడులు - గుంతకల్లులో నాటుసారా న్యూస్
అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. నాటు సారా అమ్ముతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు