అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని పలు చోట్ల నాటుసారా తయారు చేస్తున్నారని పక్క సమాచారం రావడంతో... దాడులు చేశామని గుత్తి ఎక్సైజ్ సీఐ సుభాషిణి తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 2500 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా నాటుసారా నిలువ ఉంచినా, తయారు చేసినా, అమ్మినా... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు - police raids on liquor making center
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వెంకటాంపల్లి గ్రామ సమీపంలోని కొండగుట్టల్లో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నలుగురిని అరెస్ట్ చేసి 2500లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
excise police raids on liquor making centerd in anantapur dst