అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. వీరాంజనేయ కొట్టాల గ్రామంలో వెయ్యి లీటర్లకు పైగా నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం షాపులు మూతపడటంతో నాటుసారా కేంద్రాలు పెరిగాయని ఎక్సైజ్ సీఐ హరికృష్ణ తెలిపారు.
నాటుసారా కేంద్రాలపై దాడులు: వెయ్యి లీటర్ల ఊట ధ్వంసం - నాటుసారా కేంద్రాలపై దాడులు
లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడిన వేళ... నాటుసారా తయారీ కేంద్రాలు ఒక్కసారిగా పెరిగాయి. ఎక్సైజ్ పోలీసులు ఎప్పటికప్పుడు వారిని పట్టుకుంటున్నా.. తయారుచేస్తూనే ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పలుచోట్ల దాడులు చేసి భారీ స్థాయిలో ఊటను ధ్వంసం చేశారు పోలీసులు
![నాటుసారా కేంద్రాలపై దాడులు: వెయ్యి లీటర్ల ఊట ధ్వంసం excise police raids on cheap liquor centres at kalyanadurgam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6817892-22-6817892-1587048661638.jpg)
నాటుసారా కేంద్రాలపై దాడులు
TAGGED:
నాటుసారా కేంద్రాలపై దాడులు