అక్రమంగా నాటు వైన్ తయారు చేస్తున్న కేంద్రంపై ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. భారీగా అల్లనేరేడు పళ్ల రసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామ మాజీసర్పంచ్... మారుతికి చెందిన ఇళ్లు, నేరేడు తోటలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ విజయ్‌శేఖర్ ఆధ్వర్యంలో... అధికారులు ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు.
రూ.45 లక్షల విలువైన అల్లనేరేడు వైన్ స్వాధీనం - ఉద్దేహాల్ నాటు వైన్ వార్తలు
అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో... భారీగా అల్లనేరేడు వైన్ బయటపడింది. మాజీ సర్పంచ్ ఈ వ్యాపారాన్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
wine
మారుతి అల్లనేరేడు పళ్లను కుళ్లబెట్టి నాటు వైన్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీని కోసం నిల్వ ఉంచిన 450 క్యాన్లలోని 9160 లీటర్ల కుళ్లిన అల్ల నేరేడు పళ్ల రసం, మత్తు పదార్థం, వైన్ స్వాదీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.45.80 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అల్లనేరేడు పళ్ల రసం పేరుతో నిందితుడు నాటు వైన్‌ను లీటర్ రూ.500లకు విక్రయిస్తున్నట్లు అధికారులు వివరించారు.
Last Updated : Nov 20, 2019, 6:01 PM IST