రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఏ మాత్రం సరిగా లేవని.. మాజీ ఎంపీ, తెదేపా నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ''ఇలాంటి అరాచకాలను.. పక్క రాష్ట్రాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంది.. ఈ విషయంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి'' అని అన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జేసీపై నమోదైన కేసులో ఆయన రూరల్ పోలీస్ స్టేషన్కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ పత్రాలను తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆయనను 8 గంటల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఈ సంఘటనపై తెదేపా నాయకులు ఆందోళన చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. చివరికి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన జేసీ... పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఆరోగ్యం బాగా లేదని ఆహారం, మాత్రలు తీసుకుని వస్తానని చెప్పినా వినలేదని ఆరోపించారు. తమను, కార్యకర్తలను ఎంత భయపెట్టినా ఫలితం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితిపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు.
'మమ్మల్ని వాళ్లు బెదిరిస్తున్నారు.. ప్రధాని గారూ స్పందించండి' - ex mp jc diwakar reddy comments on police beheviour
తనను అరెస్టు చేయడంపై పోలీసుల తీరును తప్పుబట్టారు.. తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఎన్ని కేసులు వేసినా.. ఒక్క కార్యకర్త కూడా భయపడే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. తనను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
మమ్మల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు జేసీ