ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పరిస్థితులపై సీఎం దృషి సారించాలి: ప్రభాకర్ చౌదరి - కరోనా వైరస్ వార్తలు

అనంతపురం జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటం పట్ల తెదేపా నేత ప్రభాకర్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని పరిస్థితులపై సీఎం జగన్ దృషి సారించాలని కోరారు.

corona cases in ananthapur district
corona cases in ananthapur district

By

Published : Aug 5, 2020, 8:19 PM IST

అనంతపురం జిల్లాలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. కొవిడ్ ఆస్పత్రుల్లోని పరిస్థితులపై మంత్రి ఆళ్ల నాని వద్ద ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రస్తావించిన తీరును అభినందించారు. కరోనా పట్ల జిల్లాలోని ప్రజలు తీవ్రమైన భయాందోళనలో ఉన్నారని చెప్పారు. కొవిడ్ ఆస్పత్రిలోనే సాధారణ రోగులను చేర్చుకోవడం సరికాదని...వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details