'సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరగా పూర్తి చేయాలి' - అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
అధునిక సదుపాయాలతో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో ప్రభుత్వం జాప్యం వహిస్తోందని తెదేపా నేత ప్రభాకర్ చౌదరి విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.

ex-mla-prabakar-chowdary
అనంతపురంలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యంపై అన్ని పక్షాలతో కలసి ఉద్యమం చేపడతామని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. ఎన్నో ప్రయత్నాలు చేసి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని తీసుకొచ్చామని... 90శాతం పనులు తెదేపా హయాంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచినా... 10 శాతం పనులు చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ...ఆదివారం నాడు దీక్షకు దిగుతానని చెప్పారు.