అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే దివంగత లక్క చిన్నపరెడ్డి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనేకల్లో ఏర్పాటు చేసిన లక్క చిన్నపరెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి, ఎంపీ తలారీ రంగయ్య ఆవిష్కరించారు. విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్క చిన్నప్పరెడ్డి సేవలు ప్రశంసనీయమన్నారు. కనేకల్, బొమ్మనహల్ మండలాల రైతులకు తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీ ద్వారా సాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని కితాబునిచ్చారు.
రోడ్లు పనులకు భూమి పూజ