ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులైన లబ్ధిదారులకు పరిహారం చెల్లించాలి' - Kalava Srinivasulu Latest news

చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని ముంపు ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులకు పరిహారం చెల్లించాలని.. తెదేపా నేతలు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత డిమాండ్ చేశారు. జిల్లా పాలనాధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

Ex Ministers meets Collector over Chtravathi reservoir Issue
శ్రీనివాసులు

By

Published : Nov 1, 2020, 3:46 PM IST

చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని ముంపు ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులకు పరిహారం చెల్లించాలని.. మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత డిమాండ్ చేశారు. ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం మర్రిమేకలపల్లిలో ముంపు బాధితులకు పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను కోరారు.

కొంతమంది లబ్ధిదారులకు ముంపు పరిహారం చెల్లించకుండానే ఇళ్లను కూల్చివేస్తూ వారిని నిరాశ్రయులను చేస్తున్న సంఘటన కలచి వేస్తోందన్నారు. నష్టపోతున్న ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేయాలని కోరామన్నారు. ప్రజలకు నష్టపరిహారం చెల్లించి.. ఆ తర్వాత తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details