ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ.. ఇతర కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తన స్వగ్రామంలో పురాతన దేవాలయాన్ని బాగు చేయించడం, ఎన్నికల ప్రచారంలో ద్విచక్ర వాహనంపై వెళ్లడం సహా పలు కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు వార్లల్లో ఉంటున్నారు.
Viral pic: మాజీమంత్రి రఘువీరాను స్తంభానికి కట్టేసి.. - పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
రఘువీరారెడ్డి(Raghu veera reddy)... ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేత. కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ.. వివిధ కారణాలత వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన్ను తాళ్లతో కట్టేసిన ఫొటో ఒకటి వైరలైంది...
రఘువీరాను స్తంభానికి కట్టేసిన మనవరాలు
అనంతపురం జిల్లా మడకశిర మండలంలో తన సొంతూరైన నీలకంఠాపురంలో ఆయన తన మనవరాలు సమైరాతో ఆటల్లో నిమగ్నమైన ఫొటోలు, వీడియోలు ట్విట్టర్లో పంచుకున్నారు. తనతో ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు.. ఆయన్ను తాడుతో స్తంభానికి కట్టేసింది. ఈ ఫొటోను రఘువీరా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇదీ చదవండి:fire: పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాడు.. ఒక్క కిక్‌తో అంతా..
Last Updated : Nov 3, 2021, 1:17 PM IST